Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తాగి మత్తులోకి జారుకున్న ఊబెర్ డ్రైవర్.. తానే డ్రైవ్ చేసుకున్న ప్యాసింజర్!

  • ఊబెర్ క్యాబ్ బుక్ చేసుకున్న ప్రయాణికుడు
  • తాగిన మత్తులో నిద్రలోకి జారుకున్న డ్రైవర్
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
క్యాబ్ రైడింగ్ సంస్థ ఊబెర్ డ్రైవర్ల లీలలు ఇన్నిన్ని కావని ఇప్పటికే రుజువైంది. డ్రైవర్లు చేస్తున్న ఘాతుకాలు ఇటీవల వరుసగా వెలుగులోకి వచ్చాయి. ఓ డ్రైవర్ మహిళా ప్రయాణికురాలిపై లైంగిక దాడికి యత్నిస్తే, మరో డ్రైవర్ ప్యాసింజర్ చెంప చెళ్లుమనిపించాడు. ఇంకో డ్రైవర్ తాను ముస్లింలు ఉండే గల్లీలోకి వెళ్లబోనంటూ ప్రయాణికుడిని నడిరోడ్డుపై దించేశాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే, ఇప్పుడు చెప్పబోయే ఘటన మాత్రం కొంచెం డిఫరెంట్.

ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్న బెంగళూరుకు చెందిన సూర్య ఓరుగంటికి ఊబెర్ డ్రైవర్ షాకిచ్చాడు. అప్పటికే పూర్తిగా మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కాసేపటికే నిద్రలోకి జారుకున్నాడు. కారు అదుపు తప్పుతుండడంతో గమనించిన సూర్య వెంటనే అప్రమత్తమై స్టీరింగ్ అందుకున్నాడు. డ్రైవర్‌ను పక్కకి జరిపి తానే డ్రైవ్ చేసుకున్నాడు.

ఇంటి వరకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిన సూర్య అనంతరం డ్రైవర్‌ను నిద్రలేపి జాగ్రత్తగా వెళ్లమని సూచించాడు. డ్రైవర్ నిద్రపోతున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసి సంస్థ సేవలను ఎండగట్టాడు. డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఊబెర్ యాజమాన్యాన్ని కోరాడు. సూర్య పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది నెటిజన్లు తాము కూడా అటువంటి అనుభవాన్నే ఎదుర్కొన్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.
Bengaluru
Uber
Driver
Dara Khosrowshahi
Karnataka
surya Oruganti

More Telugu News